తెలంగాణాలోని ఓ మంత్రికి, అధికార పార్టీకి చెందిన మరో నాయకుడికి మధ్య జరిగినట్లు పేర్కొంటున్న సంభాషణకు సంబంధించిన ఆడియో ఒకటి తీవ్ర కలకలానికి కారణమైంది. మున్సిపల్ ఎన్నికలు, టికెట్ల కేటాయింపు అంశంలో మంత్రి మల్లారెడ్డి, బోడుప్పల్ టీఆర్ఎస్ నాయకుడు రాపోలు రాములు వాయిస్ గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఆడియో సంభాషణ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాను కేసీఆర్, కేటీఆర్ దగ్గరకు పోయి చెప్తానని, రేపో, ఎల్లుండో పల్లా రాజేశ్వర్రెడ్డి దొర దగ్గరకు వెడుతున్నానని, పైసల్ అడిగిన రికార్డులు, వీడియోలు ఉన్నాయంటూ ఆడియోలో వినిపిస్తున్న వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. అధికార పార్టీలో తీవ్ర కలకలానికి కారణమైన ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియో సంభాషణను దిగువన మీరూ వినండి.