సంచలనాత్మక అంశాన్ని బయటపెడతానంటూ మీడియాను ఆహ్వానించిన పరిణామాల నేపథ్యంలో మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు కొద్ది సేపటి క్రితం అరెస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌజ్ ను అక్రమంగా నిర్మిస్తున్నారంటూ ఆరోపించిన రేవంత్ రెడ్డి మీడియాను వెంట తీసుకుని స్వయంగా ఫాం హౌజ్ సందర్శనకు బయలుదేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డినేగాక మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తెలంగాణా వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

కాగా కేటీఆర్ సతీమణి పేరున గల 8.9 ఎకరాల భూమి పక్కన గల ఫామ్ హౌజ్ ను లీజుకు తీసుకున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. నాలుగేళ్ల క్రితమే కేటీఆర్ దీన్ని లీజుకు తీసుకున్నారని, లీజు డబ్బును కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారని, ఇది దాచుకోవలసిన విషయమేమీ కాదన్నారు. ఫామ్ హౌజ్ కు సంబంధించి రేవంత్ చూపిన డాక్యుమెంట్లను ప్రతి అఫిడవిట్లో కేటీఆర్ చూపారని కూడా బాల్క సుమన్ పేర్కొన్నారు. కాగా ఆయా పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version