తెలంగాణా శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం కాషాయ కండువా కప్పి స్వామిగౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణా ఉద్యమకారుల ఆత్మగౌరవానికి ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో తాను బీజేపీలో చేరినట్లు ఈ సందర్భంగా స్వామిగౌడ్ చెప్పారు. రెండేళ్లుగా తనకు అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వలేదని ఆయన అన్నారు. గడచిన రెండేళ్లలో కనీసం వందసార్లు తాను కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ స్థానాన్ని చేపడుతుందని చెప్పారు. కాగా స్వామిగౌడ్ కు కేసీఆర్ నమ్మిన బంటుగా పార్టీలో ప్రాచుర్యం ఉంది.