జిల్లా పరిపాలనా వ్యవహారాలు చూసే కలెక్టర్లు సాధారణంగా ఎలా ఉంటారు? జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను సమన్వయం చేసుకుంటూ, అవసరమైతే కొందరిని మందలిస్తూ, ప్రతిభ చూపిన మరికొందరిని ప్రశంసిస్తూ జిల్లాను సమర్థవంతంగా పరిపాలించడమే ఐఏఎస్ అధికారుల విధులు. ఇవన్నీ మనం నిత్యం చూస్తున్న దృశ్యాలే. కానీ కలెక్టర్లు తమలోని కళా ప్రతిభను పలువురి ముందు ప్రదర్శిస్తే చూడాలని ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది కదూ? చాలా అరుదుగా ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తుంటాయి.
ఇదిగో దిగువన ఇటువంటి అరుదైన దృశ్యాలనే చూడండి. ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ క్యాంపు ఆఫీసుల్లో నిర్వహించే ‘ఎట్ హోం’ కార్యక్రమంలో తెలంగాణాలోని ఇద్దరు కలెక్టర్లు తమలోని కళను నిద్ర లేపారు. కరీంనగర్ కలెక్టర్ శశాంక గాయకునిగా గళమెత్తి స్వరార్చన చేయగా, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ వీణ వాయిద్యం చేశారు. ఈ ఇద్దరు కలెక్టర్లలో దాగిన కళాకారులకు ఈ సందర్భంగా చప్పట్లతో కూడిన ప్రశంసలు లభించాయి. వీడియోల్లో దిగువన మీరూ వీక్షించండి.