ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనపై తెలంగాణా హైకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఓయూలో రాహుల్ పర్యటనపై పర్యటనకు అనుమతి అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాహుల్ పర్యటనపై హౌస్ మోషన్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు హైకోర్టులో పూర్తయ్యాయి.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు వీసీని ఆదేశించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ఎన్ఎస్ యుఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.