మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ భూముల వివాదంపై తెలంగాణా హైకోర్టు కీలక ఉత్తర్వును జారీ చేసింది. జమునా హేచరీస్ భూముల్లో, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈటెల రాజేందర్ భూముల్లో సర్కార్ సర్వే నిర్వహించిన తీరును కోర్టు తప్పుబట్టింది. భూముల సర్వే నిర్వహించే ముందు ఈటెలకు నోటీసులు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా అధికారులు సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించారని ఆగ్రహించింది. ఈ విషయంలో జమునా హేచరీస్ సంస్థపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా మెదక్ జిల్లా కలెక్టర్ నివేదికను కూడా హైకోర్టు తప్పుపట్టింది. కలెక్టర్ నివేదికతో సంబంధం లేకుండా అధికారులు చట్టప్రకారం వ్యవహరించవచ్చని సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Comments are closed.

Exit mobile version