హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబానికి తెలంగాణా ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులకు చెందిన భూముల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకువస్తూ అధికారగణం తాజాగా చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశంగా మారంది.

మెదక్ జిల్లా హకీంపేటలో భూములను సర్వే చేయనున్నట్లు ప్రకటిస్తూ అధికారులు ఈటెల జమునకు, ఈటెల నితిన్ రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేశారు. గత మే నెల 6వ తేదీన జారీ చేసిన నోటీసులకు కొనసాగింపుగా సర్వే చేయనున్నట్లు తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలోని సర్వే విభాగం నుంచి డిప్యూటీ ఇన్స్పెక్టర్ పేరుతో నోటీసులు జారీ చేశారు.

నిర్దేశించిన సర్వే నెం. 97లో భూములను సర్వే నిర్వహించనున్నట్లు, ఈనెల 18వ తేదీన సర్వేకు హాజరు కావాలని సూచిస్తూ ఈటెల రాజేందర్ సతీమణి జమునకు, ఆయన కుమారుడు నితిన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది.

Comments are closed.

Exit mobile version