తెలంగాణాలో కరోనా వ్యాప్తిపై ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఆయన తెలంగాణా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే 4, 6 వారాల్లో తెలంగాణా రాష్ట్రం మహారాష్ట్రలా మారే అవకాశాలు లేకపోలేదన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకోవడం లేదంటే పరిస్థితులు తీవ్రంగా లేవని భావించవద్దన్నారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతినవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం లాక్ డౌన్ వంటి చర్యలకు పూనుకోవడం లేదన్నారు. కరోనాపై ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని స్వీయ నియంత్రణ పాటించకుంటే పరిస్థితి ఇంకా విషమించవచ్చన్నారు. ఇప్పుడున్న వైరస్ చాలా వేగంగా, ర్యాపిడ్ గా వ్యాప్తి చెందుతోందన్నారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించే పరిస్థితులు ఇప్పుడు దాపురించాయని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. తెలంగాణాలో కరోనా తాజా పరిస్థితులు, వ్యాప్తి, ప్రమాద తీవ్రతపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో చూసేయండి.