కేంద్ర మంత్రి నితన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని వివరించారు. రాష్ట్రంలోని రోడ్లను పూర్తి చేయాలని కోరారు. గడ్కరీ ముందు సీఎం కేసీఆర్ వివరించిన రోడ్ల వివరాలు ఇవే:
- హైదరాబాద్ ఓఆర్ఆర్ – కల్వకుర్తి రోడ్డు ఫోర్ లేనర్ గా మంజూరు ఇవ్వండి.
- హైదరాబాద్ – విజయవాడ ఎన్.హెచ్ – 65 ను ఆరు లేన్ల హైవేగా మార్చాలి.
- చౌటుప్పల్ – కంది, కరీంనగర్ – పిట్లం, కొత్తకోట- మంత్రాలయం, జహీరాబాద్ – బీదర్ డెగ్లూరు హైవీలను త్వరగా మంజూరు చేయాలి.
- కేంద్రం వద్ద పెండింగులో ఉన్న రోడ్ల నిధులను వెంటనే ఇవ్వాలి
- భారతమాల పరియోజన కింద.. హైదరాబాద్ చుట్టూ 340 కి.మీ. లాంగ్ ఎక్స్ ప్రెస్ వేను పూర్తి చేయాలి.