తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని, పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో రైతుల పోరాటానికి సంబంధించి కూడా రైతు సంఘాలతో, విపక్ష పార్టీల నేతలో సమావేశం కావచ్చనే ప్రచారం జరుగుతోంది.