గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని , తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను అభిమానించే ఒక జర్నలిస్ట్ కావలెను.
ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కెమెరాతో ప్రజల్లో అభిప్రాయాలను సేకరిస్తూ మంచి ఆర్టికల్స్ రాసే అనుభవం ఉండాలి.
అనుభవాన్ని బట్టి వేతనం ఉంటుంది . ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసి ఇంటర్వ్యూలు చేసిన వారికి ప్రాధాన్యం.
వివరాలు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 9848011699
చదవారు కదా ప్రకటన…? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రకటన ఇది. తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, తెలంగాణా ప్రభుత్వాన్ని, ప్రజలను అభిమానించే జర్నలిస్ట్ కావాలనేది ప్రకటన సారాంశం. ఇంతకీ ఈ ‘సోషల్ మీడియా ప్రకటన’లోని ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా?
సాక్షాత్తూ తెలంగాణా సీఎం పీఆర్వోలలో ఒకరైన సైదిరెడ్డిది. ఆయన ఇచ్చిన ప్రకటనే ఇది. ప్రకటనలో పొందుపర్చిన ఫోన్ నెంబర్ కూడా సైదిరెడ్డిదే. ప్రకటనపై క్లారిటీ కోసం ఆయా నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కోగా, ఆ ప్రకటన తాను ఇచ్చిందేనని, హైదరాబాద్ కోసం ఇస్తే రాష్ట్రం మొత్తం వ్యాపించిందని సీఎం పీఆర్వో సైదిరెడ్డి చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఓ జర్నలిస్టు అవసరముందని ఆయన వెల్లడించారు.
అయితే సీఎం కేసీఆర్ పీఆర్వో విభాగంలో భారీ వేతనాలను తీసుకుంటూ పనిచేస్తున్న జర్నలిస్టుల్లో ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కెమెరాతో ప్రజల్లో అభిప్రాయాలను సేకరిస్తూ మంచి ఆర్టికల్స్ రాసే అనుభవం ఉన్నవారు లేనట్లేనా?’అని జర్నలిస్టు వర్గాలు చర్చించుకుంటున్నాయి. అదీ విషయం.