ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణా సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి లేఖలు ఇచ్చారు. ప్రధాని ముందు సీఎం కేసీఆర్ ఉంచిన పలు అంశాల వివరాలు ఇవీ:
• ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలి
• రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి.
• హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలి.
• కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
• ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలి.
• మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
• ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలి.
• కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలి.
• హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.
• రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.
• వరంగల్ టెక్స్ టైల్ పార్క్ రూ. వెయ్యి కోట్ల గ్రాంటు ఇవ్వాలి.