తెలంగాణా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం అంటే చాలు… జనం టీవీల ముందు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో కేసీఆర్ ఏం చెప్తారా? అంటూ తెలంగాణా జనమే కాదు…ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని అనేక మంది తెలుగు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని పాపులర్ టీవీ సీరియల్లకన్నా, సినిమాల కన్నా కేసీఆర్ ప్రెస్ మీట్లకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ఉన్నట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఎందుకీ ఆసక్తి… అసలు ఏముంటుంది కేసీఆర్ మాటల్లో అంటే… అచ్చ తెలంగాణా మాండలికం ఉంటుంది. కాస్త ఉప్పూ, కారం దట్టించి మరీ నషాళానికి అంటించినట్లు ఉంటుంది. విపక్షాలపై విరుచుకుపడడంలో కేసీఆర్ శైలే వేరు. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది కూడా.
కేసీఆర్ చెప్పేవి సత్యాలా? అసత్యాలా? అనే రాజకీయ చర్చను కాసేపు వదిలేయండి. ఓ పత్రికాధిపతి ఆ మధ్య చేసిన భావ వ్యక్తీకరణ ప్రకారం కేసీఆర్ తిట్లు కూడా కొందరికి ఆమోదయోగ్యంగానే ఉంటాయి. ప్రత్యర్థులను దూషించినట్లే కనిపిస్తుంది. కానీ భలే అన్నాడే… అనే భావన స్ఫురిస్తుంది. అధికార పార్టీ కేడర్లో మాంచి హుషారు పుట్టిస్తుంది. పందొమ్మిదేళ్ల క్రితం పిడికెడు మందితో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రత్యర్థులపై వాడిన పదజాలంపై అనేక విమర్శలు వచ్చాయి. ఇదేం భాష? ఇవేం తిట్లు? ఇది రాజకీయ సభ్యతేనా? అని ప్రశ్నించినవాళ్లూ ఉన్నారు. కేసీఆర్ ఇవేవీ పట్టించుకోరు. తనశైలి తనదే. ఇది తెలంగాణా ‘యాస’… ఇందులో తప్పేముంది? అని ఎదురుదాడి చేసిన ఘటనలు అనేకం. కేసీఆర్ ప్రసంగానికే ఈ పరుష పదాలు ఓ రకంగా బలమని కూడా పలువురు నిర్వచించిన ఉదంతాలు ఉన్నాయి. మంగళవారం రాత్రి పొద్దుపోయాక నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ నోటి నుంచి వెలువడిన మరికొన్ని పదాలు తాజాగా చర్చకు దారి తీశాయి. ‘పక్షులకు ఇది కేసీఆర్ పెట్టిన ‘దానా’గా అధికార పార్టీ కేడర్ సోషల్ మీడియాలో తెగ పోస్టింగులు చేస్తోంది. అవేమిటో దిగువన మీరూ చదవండి.
– తాలు కాలబెట్టే.. తాలుగాళ్ళు
– పనికి మాలిన సన్నాసులు
– సిగ్గు మాలిన తనం
– తెలివి లేదు
– తలకు మాసిన సన్నాసులు
– చిల్లర రాజకీయాలు
– నాదాన్ దుష్మన్ ..!!
– ఇచ్చులు… కచ్చకాయలు
– ఇంటి పార్టీ… పక్కింటి పార్టీ… ఎదురింటి పార్టీ
– ఒక్కడు తవ్వడు… ఎత్తడు… మొయ్యడు
– దరిద్రులు… దరిద్రపు మొహాలు
– సిగ్గున్నోల్లాండీ? సిగ్గులేనోల్లు
– ఏం మొహం పెట్టుకున్నారు?
– ఏం మాట్లడ్తరండి ఇగ
– బుద్ధీ జ్ఞానముందాండీ ఇగ
– జోకర్ గాని లెక్క
– బఫూన్ లెక్క
– ఏమన్న తెలివున్న లెక్కలాండీ?
– పనికిమాలినోల్లు బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించండి
– ఇంత ఛండాలంగ
– ఇంత దరిద్రంగ
– నెవ్వర్ బిఫోరు… ఎవ్వరాఫ్టరు
– ఏం లెక్కలండియ్యి…? నాకర్థం కాదు
– దరిద్రులు
– ఏం దరిద్రులండి? పాడుగాను…
– దిక్కుమాలిన రాజకీయాలు పాడుగాను.. నాకర్థం కాదు
– ఇంత నీచంగనా?
– ఇంత ఛండాలంగనా?
– ఛీ… ఛీ…
– బుద్ధి తక్కువ
– పనికి మాలిన పని
– పనికి మాలిన దందా
– గప్పాలు కొట్టే ముచ్చట్లు
– సిగ్గు మాలినోల్లు
– పరిజ్ఞానం లేదు
– విషయం లేదు
– డెప్త్ లేదు
– ఈల్లకు సంస్కారం ఉందా?
– అడ్డం, పొడుగ్గా మాట్లడ్తరు
– నీచంగా
– బుద్ధి తెచ్చుకుని…
– సొల్లు…
– థాంక్యూ