తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈనెల 28న ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరపాలని సీఎం నిర్ణయించారు.
ఈ సమావేశంలో డ్రగ్స్ నియంత్రణ చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. రాష్ట్ర హోంమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, డీజీలు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. డ్రగ్స్ నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్షలో చర్చించనున్నారు.
డ్రగ్స్ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అభిలషిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తంగా డ్రగ్స్ నివారణకు తీసుకోవలసిన చర్యలపై సీఎం కేసీఆర్ కఠినంగా వ్యవహరించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.