రైతు ప్రయోజనాల పేరుతో టీఆర్ఎస్ పార్టీ గురువారం మహాధర్నా నిర్వహించింది. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో టీఆర్ఎస్ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం కళ్లు తెరిపించడానికే తాము యుద్ధానికి దిగినట్లు కేసీఆర్ ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా గులాబీ పార్టీ అధినేత ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే….
• రైతుల కోసం అవసరమైతే ఢిల్లీకి యాత్ర చేస్తాం.
• తెలంగాణ పోరాటాల గడ్డ, విప్లవాల గడ్డ.
• అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం.
• పరాయి పాలకుల విష కౌగిలి నుంచి బయటపడ్డం.
• ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నం.
• ఒక అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతున్నం.
• కేంద్ర నిర్ణయాలు తెలంగాణ రైతాంగానికి ఆశనిపాతమయ్యాయి.
• తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలంగాణకు తెలుసు.
• కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలను ఎదుర్కోవడం తెలుసు.
• కేంద్రం కండ్లు తెరిపించడానికే ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టాం.
• ఈ రోజు తెలంగాణ రైతుల పంటలు కొనాలని యుద్ధం చేస్తున్నం.
• రైతుల ప్రయోజనాలను రక్షించుకోవడానికే దీన్ని ప్రారంభించాం.
• హైదరాబాదుతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు.
• అవసరమైతే ఢిల్లీ వరకు కూడా యాత్ర చేయాల్సిన పరిస్థితి వస్తది.
• మన రైతుల కోసం ఎక్కడిదాకా అయినా సరే పోవాలె.
• రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలె.
• రైతుల కోసం అవసరమైతే ఢిల్లీకి యాత్ర చేస్తాం
• ఈ దేశాన్ని నడిపించే నాయకులు చాలా సందర్భాల్లో వితండవాదాలు చేశారు.
• ఇటీవల నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు కూర్చున్నారు.
• రాష్ట్ర ప్రభుత్వమే ధర్నాకు కూర్చుంటుందా? అని ప్రశ్నించారు.
• 2006లో గుజరాత్ సీఎం, ఈనాటి ప్రధాని మోదీ.. ఆనాడు 51 గంటలు సీఎం హోదాలో ధర్నాకు కూర్చున్నారు.
• మోడీ ప్రధాని అయిన తర్వాత ధర్నాలు చేసే పరిస్థితులు కల్పించారు.
• సీఎంలు, మంత్రులు ధర్నాలో కూర్చునే పరిస్థితి మోదీ విధానాలతోనే వచ్చింది.
• కేంద్రం ఈ సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరమే ఉండదు.
• సమస్యను పరిష్కరించేదాకా.. ఈ పోరాటం భవిష్యత్‌లోనూ కొనసాగుతది.
• తెలంగాణ రైతులు ధర్మంగా, న్యాయంగా వ్యవసాయం చేస్తున్నరు.
• రైతులకు అన్నీ సమకూర్చడంతో.. పంటలు బాగా పండిస్తున్నరు.
• అందుకే తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది.
• కానీ, కేంద్రం మాత్రం తెలంగాణ రైతుల పంటలు కొనడం లేదు.
• కేంద్రం విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది.
• నేటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం, వ్యవసాయం పట్ల వ్యతిరేకంగా ఉన్నది.
• కేంద్ర వైఖరి మార్చుకోవాలని అనేక సార్లు చెప్పాం.
• రైతు నిరంకుశ చట్టాలను విరమించుకోవాలని కోరినం.
• కరెంటు బకాయిల మీటర్లు పెట్టే విధానాన్ని వ్యతిరేకించినం.
• ఈ విషయాలపై కేంద్రం నుంచి స్పందనే లేదు.
• అందుకే చివరికి కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం.
• ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదు.
• ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదు.
• మన హక్కులు సాధించే వరకు పోరాడుతం.
• రైతుల ప్రయోజనాలు పరిరక్షించకుంటం.
• ఉత్తర భారతదేశంలోని రైతుల పోరాటలను కలుపుకొంటం.
• రైతుల కోసం పోరాటాన్ని భవిష్యత్‌లో ఉధృతం చేస్తం.
• తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నం.
• కేంద్రానికి మన రైతుల గోసలను, బాధలను విన్నవించాం.
• పంజాబ్‌లో వలెనే కేంద్రం తెలంగాణలో ధాన్యం కొనాలి.
• కేంద్రానికి చేతులెత్తి దండం కూడా పెట్టాం.
• కానీ కేంద్రం నుంచి స్పందన లేదు.
• నిన్న స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశాను.
• కానీ ఉలుకు, పలుకు లేదు.
• మన బాధ ప్రపంచానికి, దేశానికి తెలియాలనే ధర్నా చేస్తున్నం.
• తెలంగాణ గ్రామాల్లో కూడా వివిధ రూపాల్లో పోరాటాలను ఎంచుకుంటాం.
• ఈ పోరాటం ముందుకు కొనసాగుతూనే ఉంటది.
• కేంద్రం దిగివచ్చి మన రైతాంగానికి న్యాయం చేసే వరకు పోరాడుతం.
• రైతుల కోసం ఈ ఉద్యమాన్ని ఉప్పెనలా కొనసాగిస్తం.