సీపీఎం తెలంగాణా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నికయ్యారు. ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర మూడవ మహా సభలు ఈనెల 22వ తేదీ నుంచి హైదరాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మహాసభలో మొత్తం 60 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకుంది.
ఇందులో 15 మంది రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా, ఎనిమిది మందిని రాష్ట్ర కమిటీకి ఆహ్వానితులుగా, నలుగురిని రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా, ఐదుగురితో కంట్రోల్ కమిషన్ ను మహాసభ ఎన్నుకుంది. రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రాన్ని మరోసారి మహాసభ ఎన్నుకుంది. కమిటీ పూర్తి స్వరూపం ఇలా ఉంది.