ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ ఘటన తీవ్ర కలకలానికి దారి తీసింది. కాకినాడకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కారులో అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ అనుమానాస్పదంగా ఉండడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తెల్లవారుజామున రెండు గంటలకు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డెడ్ బాడీని తీసుకువచ్చి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు అప్పగించారు.
గడచిన అయిదేళ్లుగా మృతుడు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఓ ప్రమాదం వల్ల సుబ్రహ్మణ్యం చనిపోయాడని ఎమ్మెల్సీ చెబుతున్నప్పటికీ, సుబ్రహ్మణ్యం మరణంపై అతని తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బాధితుల ఆందోళనతో డెడ్ బాడీని తీసుకువచ్చిన ఎమ్మెల్సీ తన కారును వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఏపీలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది.