సూర్యాపేట రూరల్ ఎస్ఐ లవకుమార్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సూర్యాపేట సమీపంలోని ‘రాజుగారి తోట’ హోటల్ యజమాని నుంచి రూ. 1.30 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.
ఎస్ఐ లవకుమార్ నిన్ననే బదిలీ కావడం గమనార్హం. అయితే బదిలీ ఉత్తర్వు వెలువడ్డాక ఆయన లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం విశేషం. సంబంధిత పోలీస్ స్టేషన్ లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఫొటో: ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ లవకుమార్