ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామ కృష్ణరాజును పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నించేంత తీవ్రమైన అభియోగాలు కావని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే దశలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. కేసు దర్యాప్తునకు రఘురామ కృష్ణరాజు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఏపీ సీఐడీ అధికారులు కొద్దిరోజుల క్రితం నరసాపురం ఎంపీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.