తెలంగాణ మహిళా కమిషన్ తొలి చైర్మన్ గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ప్రభుత్వం నియమించంది. ఇందులో మరో ఆరుగురు సభ్యులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా నియామకమైనవారిలో షహీనా అఫ్రోజ్, ఈశ్వరీభాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సూదం లక్ష్మి, కటారి రేవతీ రావులు ఉన్నారు. మహిళా కమిషన్ లో నియామకమైనవారి పదవీ కాలం అయిదేళ్లుగా ప్రభుత్వం పేర్కొంది.