తాటికొండ రాజయ్య గుర్తున్నారు కదా? ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావానంతరం ఏర్పడిన ప్రభుత్వంలో తొలి డిప్యూటీ సీఎంగా కొంతకాలం కొలువు నిర్వహించిన ప్రస్తుత స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే. డిప్యూటీ సీఎంగా నియామకమై, పదవీ కుర్చీలో పూర్తిగా సర్దుకోకముందే ఆయన సీటుకు అకాల ఎసరు వచ్చినప్పటి పరిణామాలు తెలిసిందే. ఇప్పుడేంటీ అంటున్నారా? అయితే విషయం తెలుసుకోవలసిందే.
ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి పూర్వం తాటికొండ రాజయ్యకు ఫేమస్ డాక్టర్ గా పేరుండేది. చిల్ట్రన్స్ స్పెషలిస్టుగా హన్మకొండలో ఆయనకు ఇప్పటికీ మంచి డాక్టర్ గానే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన స్వయంగా నిర్వహించిన ఒకప్పటి చిల్డ్రన్స్ హాస్పిటల్ కాస్తా ప్రస్తుతం ‘రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’గా మారింది. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో రాజయ్య కుమారులిద్దరే కాదు, కోడళ్లు కూడా డాక్టర్లే.
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం సాగుతున్న నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యే కమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమ (ఆరోగ్య) యాత్ర పేరుతో అనేక రాయితీలను కల్పించారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునేవారికి రాజయ్య ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏమిటో దిగువన గల బ్రోచర్ లో వివరంగా చదివేయండి.