Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»యథాతథమా? వాయిదానా? ఇదేం ‘పరీక్ష’ సారూ??

    యథాతథమా? వాయిదానా? ఇదేం ‘పరీక్ష’ సారూ??

    March 21, 20201 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 ssc

    అది IAS వంటి ఉన్నతాధికారులు ఉండే కార్యాలయం. తెలంగాణా వ్యాప్తంగా దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. సుమారు పదకొండు లక్షల మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకై ఆలోచించే విషయం. ఇలాంటి సమయంలో అసమగ్ర సర్క్యూలర్ విడుదల కావడం విద్యావంతులను, విద్యా సంస్థల నిర్వాహకులను విస్మయానికి గురి చేసింది.

    ts29 exam
    విద్యాశాఖ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ ఇదే

    కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 23 నుండి 30వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యా శాఖ ఓ సర్క్యూలర్ కూడా విడుదల చేసింది.

    21న జరిగే హిందీ పరీక్ష యథాతథం, 23 నుండి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలు వాయిదా అనేది సర్క్యులర్ సారాంశం. కానీ ఈనెల 31న, ఏప్రిల్ 1న జరిగే సోషల్ (సాంఘిక శాస్త్రం) పరీక్ష గురించి ఏ ప్రస్తావన లేకుండా విడుదల చేయడమే ఆ సర్క్యూలర్ అసమగ్ర సారాంశం. మార్చి 31 నుంచి జరిగే పరీక్షలపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ అంశాన్ని సర్క్యులర్ లో ఉటంకించకుండా, విషయాన్ని అస్పష్టంగా చెబుతూ జారీ చేసిన ఉత్తర్వు సారాంశంపై విద్యార్థులు, విద్యా సంస్థల నిర్వాహకులు డోలాయమాన స్థితిని ఎదుర్కుంటున్నారు. ఇదీ విద్యాశాఖకు చెందిన మన ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్య నిర్వాకం.

    ✍ తుమ్మలపల్లి ప్రసాద్

    Previous Articleగిది ‘సుక్క’శుద్ధి… సూత్తె షెక్కరే మల్ల!
    Next Article మంత్రి కన్నా మస్త్ ‘గొప్పోడు’! ఇదీ ‘కరోనా’ స్క్రీనింగ్ తీరు !

    Related Posts

    దొడ్డ మనసులో వద్ది‘రాజు’

    May 12, 2023

    ఖమ్మంలో బీజేపీ నేతల అరెస్ట్

    May 5, 2023

    పొంగులేటి ఇంట్లో పొలిటికల్ స్కెచ్ ఏంటి?

    May 4, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.