ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (66) ఇక లేరు. ఈ సాయంత్రం 4.07 గంటలకు ఆయన కన్ను మూశారు. నియోమియాతో ఆయన వారం రోజుల క్రితం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన సిరివెన్నెల చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు.
చెంబోలు సీతారామ శాస్రి ఆయన అసలు పేరు కాగా, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ ఆయన పేరును మార్చారు. సిరివెన్నెల సినిమాకు తొలి గీతాలు రాసిన సీతారామ శాస్త్రి సినిమా పేరే ఇంటిపేరుగా ప్రాచుర్యం పొందారు. సిందూరం, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, రుద్రవీణ వంటి అనేక సినిమాలు సహా తాజాగా అల వైకుంఠపురం వంటి సినిమాల్లో దాదాపు 3 వేల సినీ గీతాలు రాశారు. ఆయన మరణంతో టాలీవుడ్ దిగ్ర్భాంతికి గురైంది.