పార్లమెంట్ సభ్యుడు (రాజ్యసభ) గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) బుధవారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. స్వరూపానందస్వామితోపాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామిని కూడా హైదరాబాద్ లో కలుసుకుని రవి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా స్వాములకు రవిచంద్ర ఫల పుష్పాలను అందజేసి, ఆశీస్సులు పొందారు. అనంతరం రవిచంద్రను ఆయా స్వాములు శాలువాతో సత్కరించి, ప్రసాదాలు అందజేశారు.