టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ఖాతాలో సంచలన పోస్ట్ ప్రత్యక్షమైంది. ఊసరవెళ్లి ఫొటోను షేర్ చేస్తూ, జన్మదిన శుభాకాంక్షలు… అంటూ రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో వాక్యాన్ని జోడించడం తీవ్ర చర్చకు దారి తీసింది.
గురువారం ఉదయం 9.10 గంటలకు రేవంత్ ట్విట్టర్ ఖాతాలో గల ఈ పోస్టును ట్వీట్ చేయడం గమనార్హం. అయితే రేవంత్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసి ఉంటారనే అంశంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడడం విశేషం. రేవంత్ ట్వీట్ ను దిగువన చూడవచ్చు.