కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ సెక్షన్ కింద కొత్తగా ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని కూడా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఏడేళ్ల కింద రద్దయిన చట్టంలోని సెక్షన్ 66ఏ సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు ఈనెల 5వ తేదీన విస్మయాన్ని వ్యక్తం చేసింది. రద్దయిన ఈ చట్టంలోని సెక్షన్ కింద దేశ వ్యాప్తంగా వెయ్యి కేసులకు పైగా నమోదైన తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తాజాగా ఆయా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.