ఛత్తీస్ గఢ్ లోని పాఠశాలలను, కళాశాలలను, అంగన్ వాడీ కేంద్రాలను మూసివేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశపు వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే వెల్లడించారు కోవిడ్-19 కొత్త మార్గదర్శకాలను వివరంగా అధ్యయనం చేస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తిలో ఛత్తీస్ గఢ్ దేశంలో ఆరో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. అందువల్ల స్కూళ్లను, కాలేజీలను, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందన్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న పాఠశాలలు ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఇది వర్తించదన్నారు. అదేవిధంగా లాక్ డౌన్ ద్వారా రాత్రి కర్ఫ్యూ విధించే అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు.