తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పుడు కరెన్సీ కట్టల ‘పంచుడు’ ‘కారు’ వేగంతో సాగుతోంది. ఓటుకు నోటు మాత్రమే ఇస్తే ‘పడ్తల్’ (గిట్టుబాటు) పడుతుందో లేదోనని భావించారేమోగాని, అధికార పార్టీ నేతలు గంప గుత్తగానే ఓట్లకు బేరం పెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి మున్సిపాల్టీలోని రెండో వార్డు కౌన్సిలర్ పదవికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పాస్తం హనుమంతు తరపున ఆయన బంధువులు అక్షారాల రూ. 2.40 లక్షల కరెన్సీ నోట్ల కట్టలను ఎలా పంచుతున్నారో, ఓటు కోసం మరెవరైనా వస్తే, వారికి ఎలా శాస్తి చేయాలో చెబుతున్న తీరును దిగువన గల వీడియోలో వీక్షించండి.