తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన సకలజనుల సామూహిక దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకునేందుకు యత్నించిన ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు, ఓయూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, విపక్ష నేతలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా అనేక మంది ఆందోళనకారులు గాయపడ్డారు.