నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెడుతున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఇంజన్ నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.