ఇంద్రవెల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నల్లమల బిడ్డగ చెబుతున్నా, నిన్నటి వరకు ఒక లెక్క… ఇకపై ఇంకో లెక్క’ అని అన్నారు. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని, బానిస సంకెళ్లను తెంచిన పోరాట స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇస్తోందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పరిణామాలు, పథకాలు, నిధుల మంజూరును ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావలసిన అవసరం ఉందన్నారు.
సీఎం కేసీఆర్ బరి తెగించి మాట్లాడుతున్నారని, ఏ సీఎం కూడా ఇప్పటి వరకు ఇలా మాట్లాడలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామన్నారు. దళిత, గిరిజనుల సంక్షేమానికి పాటుపడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన చెప్పారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగపు ముఖ్యాంశాలను దిగువన గల లింక్ ద్వారా చూసి, వినవచ్చు.