ఉద్యోగ మిత్రులారా,
ఎందుకు మీరు ప్రభుత్వాన్ని ఈ విపత్కర పరిస్థితుల్లో పదవీ విరమణ. వయసు పెంపు గురించి వత్తిడి చేస్తున్నారో అర్థం కావడం లెదు. రిటైర్ కాబోయే మిత్రులను పేపర్ లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో విరమణ పెంపు వార్తలను ప్రచారం చేస్తూ వారిని ప్రశాంతంగా రిటైర్ కానివ్వడం లేదు.
ఈ రోజు ఏ పత్రికో తెలియదు, ఒక లెక్క ఇస్తూ ఇప్పటికిప్పుడు ఉద్యోగుల విరమణ వయసు పెంచితే 1-4-2020 నుండి 31-3-2023 వరకు 29,562 మంది ఉద్యోగస్తులు లాభపడతారు. తద్వారా ప్రభుత్వానికి 11,725/- కోట్లు మిగిలుతాయి అని పేర్కొంది.
అర్థం కాని విషయం ఏమిటంటే… ఈ 11,725/- కోట్ల రూపాయలు 3 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగస్ద్యులు కోల్పోతారా? అలా ప్రభుత్వానికి లాభమా? లేదా ఈ 11,725 కోట్లతో పాటుగా ఈ 3 సంవత్సరాలలో పెరిగే ఇంక్రిమెంట్స్, DA లు కలిపి ఎంత లేదన్నా ఒక 20% పెరిగి తద్వారా ప్రభుత్వ ఖజానాపై బారం పడదా? తాత్కాలిక ఉపశమనం చూపించి లబ్ది పొందాలని చూడటం దివాలకోరుతనం అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఇలాంటి లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా, నిర్వీర్యమై పోతున్న యువతను ఆదుకోవాలి.
అదీగాక ఒక లక్ష జీతం పొందే ఉద్యోగి పెన్షన్ కింద 35,000/- మాత్రమే పొందుతాడు. మరి అందులో govtకు 65,000/- మిగలవా? ఈ విషయాన్ని పూర్తిగా చెప్పక, రిటైర్ కాబోయే ఉద్యోగస్తుల విరమణ వయసు పెంచితే 11,725 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయని చెప్పడం ఎవరిని మభ్య పెట్టడానికి?
ఈ విపత్కర పరిస్థితుల్లో, నిరుద్యోగ యువత తాము చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయి మరి కొంత మంది అసలు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. కేసీఆర్ గారు ఉద్యోగులకు విరమణ వయసు పెంచుతామని చెప్పినప్పుడే, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది ఇవ్వకుండా ఇటు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రెవడిలా అవుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ యువకులు,ఉద్యోగులకు చెల్లించే జీతంలో బేసిక్ శాలరీపై 2 సంవత్సరాల వరకు పని చేస్తాం అని అంటున్నారు. అలా రిటైర్ అయ్యే 29,562 ఉద్యోగుల స్థానంలో 75,000 యువ నిరుద్యోగులను నియమించవచ్చు. తద్వారా కేసీఆర్ గారు నిరుద్యోగ యువతకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారు. వారు కేసీఆర్ గారికి నిరంతరం కృతజ్ఞులై నిలబడతారు.
కాబట్టి కేసీఆర్ గారూ,
మీరు నిరుద్యోగుల భవిత దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగులు చెప్పే ఈ లెక్కలను పరిగణలోనికి తీసుకోకుండా దీర్ఘ దృష్టితో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవసలసినదిగా అభ్యర్ధన.
ప్రస్తుతం ఉన్న 58 సంవసత్సరాల పదవీ విరమణ వయస్సు సరైనది. పంజాబ్ ప్రభుత్వం తమ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఇటీవల 60 నుండి 58కి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో ఆలోచిస్తున్నది.
తమ ఇంట్లో నిరుద్యోగులు ఉన్న సగటు ఉద్యోగుల ఆవేదన
(ఇది వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న పోస్ట్. భాషా దోషాలు సవరించి వాడుకోనైనది. రచయిత ఎవరోగాని, అతనికి ధన్యవాదాలు)