తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బీఆర్ఎస్ కు చెందిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ విషయంలో దాఖలు చేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టంది. ఓటుకు నోటు కేసును ఇతర రాష్ట్ర కోర్టుకు బదిలీ చేయాలన్న జగదీష్ రెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చుతూ, విచారణను కూడా సుప్రీంకోర్టు ముగించింది.
ఊహాజనిత అంశాలతో దాఖలు చేసిన పిటిషన లో స్పష్టమైన ఆధారాలు లేవని, ట్రయల్ కోర్టు విచారణను పారదర్శకంగా చేపట్టాలని సుప్రీంకోర్డు పేర్కొంది. అంతేకాదు ఈ కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని, కేసు విషయంలో ముఖ్యమంత్రికి, హోం మంత్రికి ఏసీబీ డైరెక్టర్ జనరల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.