ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకు రంగం సిద్ధమైందా? ఈ విషయంలో ప్రభుత్వపరంగా ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం జారీ కాలేదు. కానీ ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత 32 జిల్లాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. మొత్తం 32 జిల్లాల లిస్టును, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోకవర్గాల పేర్లతో సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆయా వివరాలను దిగువన చూడవచ్చు.
1. కడప (జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప)
2. రాజంపేట (బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి)
3. కర్నూలు (నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు)
4. ఆదోని (పత్తికొండ, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు)
5. నంద్యాల (శ్రీశైలం, ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, పాణ్యం)
6. అనంతపురం (రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, శింగనమల, రాప్తాడు, తాడిపత్రి)
7. హిందూపురం (ధర్మవరం, కదిరి, పెనుగొండ, మడకశిర, హిందూపురం, పుట్టపర్తి)
8. చిత్తూరు (పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం, చిత్తూరు)
9. మదనపల్లి (పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి)
10. తిరుపతి (శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, సత్యవేడు)
11. గుంటూరు (తెనాలి, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు, ప్రత్తిపాడు)
12. బాపట్ల (రేపల్లె, చీరాల, పర్చూరు, బాపట్ల, వేమూరు)
13. నరసరావుపేట (చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, గురజాల)
14. అమరావతి (నందిగామ, జగ్గయ్యపేట, తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు)
15. ఒంగోలు (అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు, ఒంగోలు)
16. మార్కాపురం (గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం)
17. నెల్లూరు (కావలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి, కొవ్వూరు)
18. గూడూరు (సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట)
19. మచిలీపట్నం (కైకలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు)
20. ఏలూరు (పోలవరం, చింతలపూడి, గోపాలపురం, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు)
21. విజయవాడ (నూజివీడు, తిరువూరు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం)
22. కాకినాడ (పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రామచంద్రపురం, పెద్దాపురం)
23. రాజమండ్రి (అనపర్తి, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, రాజానగరం)
24. అమలాపురం (ముమ్మిడివరం, పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, మండపేట)
25. నరసాపురం (ఆచంట, పాలకొల్లు, తణుకు, నరసాపురం, ఉండి, తాడేపల్లిగూడెం, భీమవరం)
26. విశాఖపట్నం (భీమిలి, గాజువాక, పెందుర్తి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్)
27. అనకాపల్లి (చోడవరం, నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, తుని, పాయకరావుపేట)
28. అరకు (పాడేరు, అరకు, జి.మాడుగుల)
29. విజయనగరం (చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, శృంగవరపుకోట)
30. పార్వతీపురం (కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ)
31. శ్రీకాకుళం (ఆముదాలవలస, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం)
32. పలాస (పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, పలాస)