నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ తన అభ్యర్థిగా డాక్టర్ పనుగోతు రవికుమార్ ను ఖరారు చేసింది. ఈమేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోమవారం రాత్రి అధికారికంగా రవికుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. బీజేపీ నుంచి కంకణాల నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్ లు టికెట్ ఆశించగా, రవికుమార్ వైపే పార్టీ మొగ్గు చూపడం విశేషం. సామాజిక సమీకరణలే ప్రామాణికంగా రవికుమార్ కు టికెట్ కేటాయించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.