గిరిజన తెగల్లో ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడం సహజమే. ఆదివాసీ చట్టం 1935 ప్రకారం బహు భార్యత్వం ఈ తెగల్లో ఆమోదయోగ్యమే. ఇరువర్గాలు, గిరిజన సమాజం ఆమోదిస్తే ఆయా తెగల్లో ఇది సర్వసాధారణం. ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడం బస్తర్ ప్రాంతంలో కనిపిస్తుంటుంది కూడా. అయితే సాధారణంగా ఈ తరహా బహు భార్యత్వపు ఉదంతాలు ఒకరి తర్వాత మరొకరు మాత్రమే భార్యలుగా ప్రవేశించడాన్ని గిరిజన కుటుంబాల్లో చూస్తుంటాం. కానీ ఒకే పెళ్లి మంటపంలో, ఒకే వేదికపై, ఒకేసారి ఇద్దరు వధువులతో వరుడు ఏడడుగులు నడవడం బస్తర్ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జగదల్ పూర్ జిల్లా టిక్రా లోహంగాలో ఈ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. చందు కశ్యప్ వివాహానికి సంబంధించిన ఇద్దరు వధువుల ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే ఒకే వేదికపై ‘ఓ వరుడు, ఇద్దరు వధువులు… ఓ పెళ్లి’ అన్నమాట. స్థానిక గిరిజన తెగల్లో ఈ తరహా వివాహం జరగడం ఇదే మొదటి ఘటన కావడం విశేషం. ఇరు వర్గాలకు చెందిన పెద్దల అంగీకారంతో ఆచార, సంప్రదాయం ప్రకారమే జరిగిన ఈ అరుదైన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను దిగువన మీరూ చూసేయండి.