‘మీకు చేతులెత్తి దండం పెడుతున్నా… దయచేసి కరోనా కట్టడికి సహకరించండి’ అంటున్నారు తెలంగాణాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్. ఇది చాలా సీరియస్ విషయమని, నిజంగా దండం పెట్టి చెబుతున్నానని ఆయన ప్రజలను అభ్యర్థించారు. కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగా ఆయన మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో క్షేత్ర పర్యటన చేశారు.
రానున్న 14 రోజులు అత్యంత కీలకమని, కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలన్నారు. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు తమకు తాము స్వీయ నిర్బంధం చేసుకోవాలని కూడా కృష్ణభాస్కర్ సూచించారు. ఇది తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధరరావు, మున్సిపల్ కమిసనర్ సాంబయ్య తదితరులు ఉన్నారు.
కరోనా వ్యాధి కట్టడికి ప్రజల సహకారాన్ని కోరుతూ కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రజలను అభ్యర్థిస్తున్న వీడియోను దిగువన చూడండి.