దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఎం. రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల అధిక్యతతో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.