మీడియా వాళ్లే తప్పులు ఎత్తి చూపుతారా? సామాన్యులు ఎత్తి చూపలేరా? అంటే… ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా వాళ్లు మాత్రమే తోపులు కాదు అని అంగీకరించక తప్పదు. అన్న వర్గాలను, అన్ని వ్యవస్థలను ప్రశ్నించే మీడియా, దానికి సంబంధించిన వ్యవస్థలు ‘రాంగ్ రూట్’లో వెడుతున్నపుడు ఎవరు ఎవరినైనా వీడియో షూట్ చేయవచ్చు. కాస్త శ్రద్ధ చూపితే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే… ముఖ్యంగా సోషల్ మీడియా వీరులనే చెప్పవచ్చు.
దిగువన గల వీడియోను ఓసారి చూడండి. టీవీ9 లైవ్ వెహికిల్ ఒకటి ‘రాంగ్ రూట్’లో వెడుతుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కిల్లకిల్లా నవ్వుతూ… ‘రాంగ్ రూట్ లో వెళ్తున్న టీవీ9 ప్రెస్ బండి…వీళ్లే తీస్తారు రాంగ్ రూట్లో… మనం తియ్యలేమా…?’ అని ఓ గొంతు వీడియోలో ప్రశ్నిస్తోంది. ‘మెరుగైన సమాజం’ కోసం ఎవరో ఈ వీడియో తీసినట్లుంది కదూ! హలో టీవీ9… తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు… అనే వేమన పద్యం గుర్తుకొస్తున్నదా??