Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»స్వామి రమేష్ కుటుంబం ఔదార్యం

    స్వామి రమేష్ కుటుంబం ఔదార్యం

    March 19, 20222 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 jim

    ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ కుటుంబం మరోసారి తన ఔదార్యాన్ని చాటుకుంది. న్యాయమూర్తుల, న్యాయవాదుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా జిల్లా కోర్టు సముదాయాల ప్రాంగణంలో జిమ్ ను స్వామి రమేష్ కుటుంబం ఏర్పాటు చేసింది. దాదాపు రూ. 8.00 లక్షల విలువైన మిషనరీని ఈ జిమ్ ఏర్పాటుకు స్వామి రమేష్ కుటుంబం ఉచితంగా అందజేసింది. స్వామి రమేష్ తండ్రి స్వామి గురునాథం ఈ జిమ్ ను ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈనెల 20వ తేదీన జిమ్ ప్రారంభానికి సర్వం సిద్దం చేశారు.

    ts29 swamy ramesh
    స్వామి రమేష్ కుమార్

    జిమ్ ఏర్పాటు అంశంపై ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా కోర్టు సముదాయపు ప్రాంగణంలో జిమ్ ఏర్పాటు కోసం తాను పదిహేనేళ్లుగా ప్రయత్నించి ఇప్పటికి సఫలమైనట్లు చెప్పారు. నిత్యం వేలాది కేసుల పరిష్కారంలో అటు న్యాయమూర్తులు, ఇటు న్యాయవాదులు ఫైళ్లతో కుస్తీ పడుతూ శారీరకంగానేగాక, మానసికంగానూ అలసిపోతుంటారని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయమూర్తుల, న్యాయవాదుల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యంగా జిమ్ ఏర్పాటుకు షెల్టర్ కోసం పదిహేనేళ్లుగా పోరాటం చేశానని చెప్పారు.

    ఎట్టకేలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్, జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఇతర న్యాయమూర్తుల సహకారంతో జిమ్ ఏర్పాటుకు షెల్టర్ సాధించినట్లు స్వామి రమేష్ కుమార్ సంతోషంతో చెప్పారు. దినసరి ఓ పదిహేను నిమిషాల సేపు న్యాయాధికారులు, న్యాయవాదులు ఈ జిమ్ లో వ్యాయామం చేస్తే తన లక్ష్యానికి సార్థకత చేకూరినట్లేనని స్వామి రమేష్ కుమార్ పేర్కొన్నారు. పదే పదే రూపం మార్చుకుంటున్న కరోనా వంటి పరిణామాల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఓ పావు గంట సేపు జిమ్ లో శ్రమిస్తే ఇమ్యూనిటీ పెరగడంతోపాటు శరీర దారుఢ్యం కలుగుతుందన్నారు.

    ts29 jim2
    ఖమ్మం జిల్లా కోర్టులో స్వామి రమేష్ కుటుంబం ఏర్పాటు చేసిన జిమ్

    జిమ్ ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయని, ఆదివారం హైకోర్టు న్యాయమూర్తుల, జిల్లా న్యాయమూర్తుల చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తున్నట్లు స్వామి రమేష్ కుమార్ వివరించారు. జిమ్ ఏర్పాటుకు షెల్టర్ కల్పించే విషయంలో సహకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డికి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ ప్రసాద్ కు స్వామి రమేష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

    lawyer swamy ramesh swamy gurunatham swamy ramesh kumar లాయర్ స్వామి రమేష్ స్వామి గురునాథం స్వామి రమేష్ కుమార్
    Previous Articleకేసు మీద కేసు… షాక్ మీద షాక్!
    Next Article ‘ఫాం హౌజ్’లో సీఎం అత్యవసర సమావేశం

    Related Posts

    ఖమ్మంలో మళ్లీ కండల వీరుల సందడి

    November 18, 2021

    ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ కు అరుదైన గౌరవం

    March 2, 2021

    బాడీ బిల్డర్లకు శుభవార్త: ఖమ్మంలో చిత్తరేష్ నటేషన్

    January 11, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.