కరోనా వ్యాక్సిన్ పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు వయస్సు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రం మోదీ జాతినుద్ధేశించి ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, కేంద్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని ప్రకటించారు. వచ్చే నవంబర్ వరకల్లా దేశంలో 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. కాగా 25 శాతం వ్యాక్సిన్లను ప్రయివేట్ ఆసుపత్రులకు అందిస్తామని, రూ. 150 సర్వీస్ ఛార్జి భరించేవారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు.

Comments are closed.

Exit mobile version