తెలంగాణాలో ఈనెల 27 నుండి, ఆంధ్రాలో సెప్టెంబర్ 5 నుండి బడులు తెరుస్తున్నారు. చాలాకాలం ఇంట్లో ఉన్న టీచర్లు ఇప్పుడు బడిబాట పట్టబోతున్నారు. ఈ సందర్భంగా టీచర్లు ఖచ్చితంగా కొన్ని స్వయం నిబంధనలు పాటించాల్సిన అవశ్యకత ఏర్పడింది. కరోనా కల్లోల పరిస్థితులు ఇందుకు అనివార్య స్థితిని కల్పించాయి. తమ కుటుంబ సంక్షేమాన్ని కాంక్షిస్తూ టీచర్లు స్వీయ నిబంధనలను పాటిస్తే కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇంటి నుంచి బడికి వెళ్లే ముందు, బడిలో, ఇంటికి చేరుకున్న తర్వాత ఏమేం చేయాలో దిగువన చదవేయండి.
ఇంటి నుండి బడికి వెళ్లే ముందు:
1. మాస్కు ధరించాలి.
2. బ్యాగ్ లో సబ్బు, sanitiser అదనపు మాస్కు ఉంచుకోవాలి.
3. ఎవరి ప్లేట్, వాటర్ bottle, స్పూన్ వారే తీసుకువెళ్లాలి.
4. పవర్ బ్యాంక్, చార్జర్ లు వంటివి కూడా ఎవరివి వారే తీసుకువెళ్లాలి.
5. Two వీలర్ పై ఒక్కరు మాత్రమే వెళ్ళాలి.
6. కారులో ఇద్దరు మాత్రమే. ఒకరు ముందు సీట్లో ఇంకొకరు వెనుక సీట్లో కూర్చోవాలి. కారు కిటికీలు తెరిచి ఉంచాలి.
7. బస్సులో వెళ్లేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
8. అనవసరంగా ఎవరితో ముచ్చటించరాదు ప్రయాణంలో.
9. అనారోగ్యంగా ఉంటే బడికి వెళ్లకూడదు.
10. అవసరమైన మందులు వెంట తీసుకువెళ్లాలి.
బడిలో:
1. అనవసరంగా వస్తువులను తాకరాదు.
2. భౌతిక దూరం పాటించాలి.
3. మాస్కు, ఫేస్ షీల్డ్ నిరంతరం ధరించాలి.
4. మీరు వాడే వస్తువులను రోజూ శుద్ధి చేసుకోవాలి.
5. కరచాలనం వద్దు, నమస్కారం ముద్దు.
6. సమావేశాలు భౌతిక దూరంతో నిర్వహించాలి.
7. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.
8. భోజనాలు సామూహికంగా చేయరాదు. ఎవరి స్థానంలో వారే తినడం మంచిది.
9. బడికి వచ్చే బయటి వారితో తగు జాగ్రత్తలు పాటించాలి.
10. అత్యంత సన్నిహితులతో కూడా జాగ్రత్తలు పాటించాలి.
ఇంటికి వచ్చిన తరువాత:
1. ఇంటికి రాగానే వెంటనే స్నానం చేయండి.
2. విడిచిన బట్టలు డిటర్జెంట్ లో నాన పెట్టండి.
3. తీసుకువెళ్లిన వస్తువులను శుద్ధి చేయండి.
4. మొబైల్ ని శుభ్రం చేయండి.
5. ఇవన్నీ పూర్తయ్యేదాకా ఇంట్లో వారికి దూరంగా ఉండండి.
6. ఆవిరి పట్టుకోండి.
7. గొంతుని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి.
వీటితో పాటు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర ఖచ్చితంగా అలవర్చుకోండి. అనవసర ఆందోళనలు వద్దు.
జాగ్రత్తే కరోనాకు మందు
✍️ యాదగిరి శేఖర్ రావు
ట్రస్మ, రాష్ట్ర అధ్యక్షుడు