ప్రి-వెడ్ షూట్… అంటే పెళ్లికి ముందు నిర్వహించే ఫొటో, వీడియో సెషన్ అన్నమాట. ఇటీవలి కాలంలో ప్రి-వెడ్ షూటింగుల పైత్యం మరీ ముదిరిపోయింది లెండి. పెళ్లి ఖరారైందే తడవుగా అనేక జంటలు మరీ ‘అతి’గా ప్రి-వెడ్ షూట్ ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నాయి. ఈ వ్యవహారం మరీ పరాకాష్టకు చేరిన పైత్యపు ఘటనలు అనేకం ఇటీవల వెలుగు చూశాయి.
ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో మరీ అతిగా భావించవచ్చు, శుభకార్యానికి ముందే చావు తరహాలో ప్రి-వెడ్ షూట్ నిర్వహించడమే విచిత్రం. ఆత్మహత్య చేసుకుని ఒడ్డుకు కొట్టుకొచ్చిన ప్రేమజంట తరహాలో ప్రి-వెడ్ షూట్ నిర్వహించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ‘వీళ్ల మొహాలు మండ… ఇదేం ప్రి-వెడ్డింగ్ షూటింగ్ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక దిగువన గల వీడియో చూసేయండి.