హైదరాబాద్ లోని Q News ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు చెందిన Q News ఆఫీసులో మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
తన ఫొటోను అవమానపరుస్తూ తప్పుగా ప్రచారం చేశారని ఓ యువతి సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తీన్మార్ మల్లన్నపై యువతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయా వార్తల సారాంశం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.