మేడారం జాతరలో బుధవారం అర్థరాత్రి దాటాక… సమయం సుమారు 12.25 గంటల ప్రాంతంలో… అంటే గురువారం తేదీ ప్రవేశించాక సారలమ్మ తల్లిని ఆదివాసీ పూజారులు తీసుకువచ్చారు. కన్నెపల్లి నుంచి మేడారానికి దాదాపు ఐదు కిలోమీటర్ల మార్గంలో పోలీసు బందోబస్తు మధ్య, మేళ, తాళాలతో, డప్పు వాయిద్యాలతో అత్యంత వైభవోపేతంగా సారలమ్మను గద్దె మీద ప్రతిష్టించారు.
ఏముందీ ఇందులో కొత్తగా చెప్పే విశేషం అంటే… సారక్క రాక సందర్భంగా పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. వన దేవతల రాక సందర్భంగా గౌరవ సూచకంగా ప్రతి జాతరలో పోలీసులు తుపాకీ కాల్పుల మోత మోగించడం ఆనవాయితీ. అటువంటి అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు.