భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం కలిగించిన ఘటన ఇది. మావోయిస్టు నక్సలైట్లు అమర్చిన మూడు మందుపాతరలను పోలీసులు కనుగొన్నారు. చర్ల-భద్రాచలం ప్రధాన మార్గంలో తేగడ-కలివేరు గ్రామాల మధ్య గల రోడ్డులో నక్సలైట్లు మూడు మందుపాతరలను పాతిపెట్టారు. వీటిని గుర్తించిన పోలీసులు అత్యంత చాకచక్యంగా బాంబ్ డిస్పోజల్ స్పెషల్ విభాగపు సిబ్బంది సహకారంతో నిర్వీర్యం చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనానికి దారి తీసింది.
ఫొటో: మందుపాతరలను నిర్వీర్యం చేస్తున్న భద్రాద్రి జిల్లా పోలీసులు