వారపు సంతకు వెళ్లిన ఓ పోలీసు దారుణ హత్యకు గురయ్యారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కుత్రు వారపు సంతలో అసిస్టెంట్ కానిస్టేబుల్ ఒకరు కూరగాయలు కొనేందుకు వెళ్లారు. ఇదే సమయంలో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మిక దాడి చేసి గొడ్డలితో నరికి చంపారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. జవాన్ పై నక్సలైట్లు దాడి చేశారా? లేక వ్యక్తిగత కక్షలేమైనా దాగి ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనను బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు