జానపద గీతాల గొంతు వంగపండు ప్రసాదరావు ఈ ఉదయం విశాఖపట్నంలో మృతి చెందినట్టు ఇప్పుడే ఆకాశవాణి వార్తల్లో విన్నాను.
“ఏం పిల్లో ఎల్దామొస్తవా…” అంటూ తెలుగు ప్రజలను ఉద్యమ బాటవైపు పరుగులెత్తించిన వంగపండు.
“చెవుల పిల్లులే శంఖమూదెనట”
“చిలకలు కత్తులు దులపరిస్తయట”
“బడితెలు పట్టిన మిడతలున్నయట”
“పులుల్ని మింగిన గొర్రెలున్నయట”
అంటూ ప్రకృతిని తిరగేసి తన గీతాల్లో వినిపించారు.
ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై కూడా ఆయన ఓ పాటరాసి పాడారు. బహుశా ఇదే ఆయన చివరి పాట అయ్యుండొచ్చు.
జజ్జనకరి కరోనా.. చూడర దాని ఘరానా..
జజ్జనకరి కరోనా.. చూడర దాని ఘరానా..
భయపడితే కరోనా.. బంకలాగ పడతాది..
ఒరే ఇంటినుంటే కరోరా.. వీధిలుంటది కరోనా..
వీధిలుంటే కరోనా.. ఇంటికొత్తది కరోనా..
దూరం దూరం మెలగడమే.. దీన్ని చంపే ఆయుధం..
జజ్జనకరి కరోనా.. చూడర దాని ఘరానా…
✍️ గోపి దారా