పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు జారీ చేయాలని 73 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు పోడు భూములపై తెలంగాణా హైకోర్టు విచారణ ప్రారంభించింది. పోడు భూముల్లోని రైతులను బలవంతంగా ఖాళీగా చేయించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది తీగల రామ్ ప్రసాద్ కోరారు.
ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీని, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీని పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్పై చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ విచారణ చేపట్టారు. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 10 రోజుల వరకు వాయిదా వేసింది