ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సీబీఐ కోర్టు స్వీకరించింది. పిటిషన్ విచారణ అర్హతలపై ఈనెల 22వ తేదీన వాదనలు విన్న తర్వాత సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కాగా రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై తొలుత కోర్టు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయితే కోర్టు అభ్యంతరాలపై రఘురామ కృష్ణంరాజు వివరణ ఇచ్చారు.